ఉద్యమ కాగడా 'షాహీన్ బాగ్'

....... కె. రమ



ఢిల్లీలో అందరి ఇళ్ళలో చొరబడి మీ చెల్లెలు, అక్కలు, కూతుర్లపై లైంగిక దాడులు జరుపుతారు. చంపుతారు. బీజేపీకి ఓటేయక పోతే ఢిల్లీ మరో కాశ్మీలా మారుతుంది. జాగ్రత్త! బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడున్న మసీదుల్నీ, షాహీనా బాగ్ ను ఒక్క గంటలో ఖాళీ చేయిస్తాం, లేదంటే రేపు మోడీగానీ, అమిత్ షా గానీ మిమ్మల్ని కాపాడడానికి రారు” అంటూ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి అనురాగ్ రాగూర్, అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్, యూపీ ఎంపీ యోగీ ఆదిత్యనాలు కూడా ఇలాగే షాహీన్‌బాగ్ నిరసనకారులపై నోరు పారేసుకున్నారు.


ఏమిటీ షాహీన్‌ బాగ్ అక్కడ ఏమి జరుగుతున్నది? వారిని ఒక్క ఖాళీ చేయిస్తామని ఎందుకంటున్నారు? అంత తప్పేం చేశారు వారు? షాహీన్‌ బాగ్ ను చూసి ఎందుకంత భయపడుతున్నారు? లైంగి అత్యాచారాలు జరుపుతారనీ, చంపుతారనే ఆరోపణ ఎవరిపై చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఏమిటా ప్రత్యేకత?


"షాహీన్బగ్” న్యూఢిల్లీలోని ఒక మురికివాడ. ఇది ఎవరూ పట్టించుకోని, పట్టని ఒక బస్తీ. ఇక్కడ మురికి కాలువలు పొంగి, పొర్లుతూ వుంటాయి. ఎక్కడ చూసినా కరెంటు తీగలు మర్రి చెట్టు ఊడల్లా ప్రమాదకరంగా వేలాడుతూ వుంటాయి. ఇంకా చెప్పాలంటే ఈగలకూ, దోమలకూ ఇది నెలవు. ఇప్పటి వరకూ ఎవరి చూపుకూ నోచుకోని మురికివాడ ఇది. ఎటువంటి ప్రత్యేకతలూ లేని ఈ మురికివాడ నేరం అందరి నోళ్ళల్లో నానుతున్నది. మరిన్ని షాహీన్‌ బార్లు నిర్మించాలనే నినాదం ఘోరెత్తుతున్నది.


బీజేపీ ప్రభుత్వం 1955 పౌరసత్వ చట్టానికి సవరణలు చేసింది. దీని ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వలస వచ్చిన హిందువులకూ, క్రైస్తవులకూ, సిక్కులకూ, జైనులకూ, పార్శిలకూ, ఒక్క మాటలో చెప్పాలంటే ముస్లిమేతరులకు ఐదు సంవత్సరాలు మన దేశంలో వుంటే, ఈ చట్టం ప్రకారం పౌరసత్వం లభిస్తుంది. అస్సాంలో చేసిన ఎస్ఆర్ సీని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం దేశంలో వున్న 130 కోట్ల మంది ప్రజలు తమ పౌరసత్వాన్ని నిరూపించు కోవడానికి తమ, తమ తల్లిదండ్రుల జనన ధృవీకరణ పత్రాలను చూపించాలని నోట్ల రద్దు తరువాత మరోసారి ధృవీకరణ పత్రాల కోసం క్యూకట్టాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తున్నది.


మన రాజ్యాంగం మతాతీత, కులాతీత లౌకిక రాజ్యాంగం. దీని ప్రకారం పౌరసత్వం ఇవ్వడానికి ముస్లింలను మినహాయించి, ఆరు మతాలను పేర్కొనడం రాజ్యాంగ విరుద్ధమైనది. ఇది ముస్లింలకు సహజంగానే తీవ్ర ఆందోళనకూ, భయానికి గురి చేసింది. దానితో జామియా మిలియా, జేఎన్‌యూ, అలీఘర్ లాంటి అనేక యూనివర్సిటీలు ఉద్యమ కేంద్రాలయ్యాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు విరుచుకు పడ్డారు. లైబ్రరీలోకి కూడా చొరబడి, భయంతో తలదాచుకున్న విద్యార్థులను కూడా వదల లేదు. విచక్షణా రహితంగా కాల్పులు చేశారు. ఈ పరిణామం జామియా మిలియా ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఎస్ఆర్ సీ అమలు దృశ్యం ఎలా వుండబోతోందో వారి కళ్ళ ముందు కనపడింది. దానితో జామియా మిలియాలోని షహీన్ బాగ్ ముగ్గురు మహిళలు బయటకు వచ్చి ఎస్ఆర్ సీ, ఎపిఆర్, సీఏఏలకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించారు.


షాహీన్‌కు సంఘీభావం


కేవలం ముగ్గురితో డిశంబర్ 16న మొదలైన షహీన్బగ్ శిబిరం, నేడు వేలాది మందితో నిరసనలకు నెలవైంది. అంతేకాదు.. దేశవ్యాప్త ఉద్యమ స్ఫూర్తిని అందిస్తున్నది. షాహీన్‌బాగ్ ముస్లిం మహిళలు అందించిన ఉత్తేజంతో నేడు దేశ వ్యాప్తంగా అలాంటి నిరసన శిబిరాలు యాభై నడవడం గమనార్హం. షాహీన్‌బాగ్ నిరసన శిబిరానికి అపూర్వ, అనిర్వచనీయమైన మద్దతూ, సంఘీభావం లభించింది.


షాహీన్బాగ్ శిబిరంలో నేడు వేలాది మంది మహిళలు పాల్గొంటున్నారు. మూడు డిగ్రీల సెల్సియస్ వణికిస్తున్న చలిలో సైతం, చంటి పిల్లలను చంకనేసుకొని వచ్చి నిరసన కార్యక్రమా లలో పాల్గొనడం విశేషం. అలా ఒక విషాదం కూడా చోటు చేసుకుంది. బల్లూ హౌస్ ఏరియాకు చెందిన నజియా డిశంబర్ 18 నుండి నాలుగు నెలల కుమారుడు జహానన్ను తనతో పాటే రోజూ షాహీన్‌ బాగ్ ధర్నాకు తీసుకొచ్చారు. గడ్డ కట్టే చలిలో చలి తీవ్రతకు ఆ బాలుడు జనవరి 30న చనిపోయాడు. అయినా, ఆందోళన విరమించేది లేదని ఆ తల్లి ప్రకటించడం స్ఫూర్తి దాయకం. ఈ నిరసన కారుల్లో అత్యధికులు ఉద్యోగాలు, వృత్తులో వున్న వారే. ఆఫీసులకు వెళ్ళి వచ్చి నేరుగా ధర్నా శిబిరంలో పాల్గొనడం విశేషం. ఇక గృహిణులైతే ధర్నా శిబిరంలోనే వుంటున్నారు. ఉపన్యాసాలు వింటున్నారు. దేశ భక్తియుత పాటలు పాడుతున్నారు. దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు. పది సంవత్సరాలు చిన్నారులు సైతం ఆగకుండా నినాదాలు ఇస్తున్న అపురూప దృశ్యాలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి.


ఈ ధర్నా శిబిరంలో గత యాభై రోజులుగా పాల్గొంటున్న వేలాది మంది మహిళలకు ఎస్ఆర్ సీ అంటే ఏమిటి? ఎన్‌పిఆర్ అంటే ఏమిటి? సీఏఏ అంటే ఏమిటి? అనే విషయం లోతుగా తెలియక పోవచ్చు. కానీ, అది ఒక రాక్షస చట్టమని మాత్రం వారు గ్రహించారు. అందుకే షాహీన్బగ్ ఉద్యమాన్ని స్వంతం చేసుకున్నారు. ఈ ప్రభుత్వం మైనారిటీలకు వివక్షా పూరితంగా వ్యవహరిస్తున్నదనీ, మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నదని అర్థం చేసుకున్నారు.


అందుకే వేలాది మంది మహిళలు స్వచ్చందంగా రోడ్లపై బైఠాయిస్తున్నారు. పిల్లలు "సేవ్ డెమోసీ, సేవ్ ఇండియా” అంటూ చేస్తున్న నినాదాలు ఘోరు చూస్తుంటే అక్కడికి వెళ్ళి చిన్నారులను ఆలింగనం చేసుకోవాలనిపిస్తున్నది. 'షాహీన్‌బాగ్ధర్నా ప్రాంతంలో చైతన్యం వెల్లివిరుస్తున్నది. ఆ ప్రాంత గోడలు గాంధీ, అంబేద్కర్, భగత్ సింగ్ తదితరుల ఫోటోలతో, నినాదాలతో పోస్టర్స్ తో నిండి పోయాయి. రోడ్లపైన కూడా ఎస్ఆర్ సీ, ఎపీఆర్సీఏఏ నినాదాలతో నింపేశారు.


రోజు రోజుకు షాహీనాగ్ మహిళల ఉద్యమానికి సంఘీభావం పెరుగుతున్నది. నిరసన శిబిరంలోని మహిళలకు వెజిటేరియన్ బిరియాని ప్యాకెట్స్, సమోసాలూ, వాటర్ బాటిల్స్,