తెలుసుకుందాం!)

పాదరసం ఎలా తయారవుతుంది..? ఉపయోగాలేమిటి..?


పాదరసం ఎలా తయారవుతుంది? దాని ఉపయోగాలేమిటి? పాదరసం ప్రకృతి సిద్ధంగా ఏర్పడుతుందా? కృత్రిమంగా తయారు చేస్తారా? పాదరసానికి సంబంధించిన పౌరాణిక గాథ ఎంతవరకు నిజం? చెట్ల అడుగుభాగాన పాదరసం ఉంచి చంపుతారు అనేది ఎంతవరకు నిజము?



పాదరసం గురించి తెలియనివారు ఉండరు. సాధారణ ఉష్ణోగ్రత దగ్గర ద్రవస్థితిలో ఉండే ఏకైక లోహమూలకం (metallic element) ఇదే! మిగిలిన లోహాలన్నీ ఘనస్థితి (solid state) లో ఉంటాయి. పాదరస పరమాణువులో 80 ఎలక్ట్రాన్లు, 80 ప్రోటాన్లు, సుమారు 120 న్యూట్రాన్లు ఉంటాయి. ఓ పదార్థపు రసాయనిక లక్షణాలను (చాలావరకు భౌతికలక్షణాలనూ) నిర్దేశించేది ఆయా పదార్థపు అంతర్నిర్మాణంలో ఎలక్ట్రాన్లు ఏవిధంగా అమరి ఉన్నాయన్న అంశమే! ఆ దృక్కోణంలో చూస్తే పాదరసంలో ఎలక్ట్రాన్ల అమరిక విధానం (electron configuration) పరమాణువుకు చాలా స్థిరత్వాన్ని ఇచ్చే విధంగా ఉంది. అందువల్ల పరమాణువుకు, పరమాణువుకు మధ్య ఆకర్షణ తక్కువ ఉండడం వల్ల పాదరసం ఘనస్థితిలో ఉండడం లేదు. పోనీ ద్రవస్థితిలోనైనా అంతర్పరమాణు ఆకర్షకబలాలు సజావుగా ఉ న్నాయంటే అదీ లేదు. అందువల్లే పాదరసానికి తలతన్యత (surface tension) కూడా తక్కువే! అంటే పాదరసాన్ని నేలమీదకు వేస్తే చిన్నచిన్న ముక్కలవుతుంది. ఆ ముక్కలు దగ్గరదగ్గరగా ఉ న్నా అతుక్కోవు. పాదరసపు పరమాణు వుల మధ్య ఆకర్షణ తక్కువ ఉండడం వల్ల పాదరసం త్వరితంగా, సులభంగా ఆవిరవుతుంది. అంటే దానర్థం దాని భాష్పీభవన ఉష్ణోగ్రత (boiling point) తక్కువని అర్థంకాదు. కానీ, సాధారణ ఉష్ణోగ్రత వద్ద కూడా పాదరసం తగినంత మోతాదులో వాయురూపంలో ఉంటుంది. పాదరసం ద్రవస్థితిలో ఉన్నా ఇనుము, రాగి, బంగారం వంటి ఘనరూప లోహాలకన్నా సాంద్రతరంగా ఉంటుంది. ఒక ఘ. సెం.మీ. పాదరసం సుమారు 14 గ్రాములు తూగుతుంది. అందుకే ఇనుపముక్కలు కూడా పాదరసంపై తేలతాయి. బంగారం, వెండి, రాగి వంటి లోహాలంటే పాదరసానికి ఎనలేని ప్రేమ. తనలోకి రోహాలను కరిగించుకొన్న పాదరస ద్రావణాన్ని అమాల్గములు (amalgums) అంటారు. అల్యూమినియం వంటి పాత్రలకు ఏ కొంచెం పాదరసం తగిలినా ఆ అల్యూ మినియం మొత్తమే నాశనం అయిపోతుంది. పాదరసానికి ఉష్ణ వాహకత్వం (thermal conductivity) తక్కువగా ఉన్నా, విద్యుద్వాహకత (electrical conductivity) మెండుగానే ఉంటుంది. పాదరసానికి ఉన్న అధిక సాంద్రత, లోహధృతి (mettalic lustre), అల్ప ఉష్ణవాహకత లక్షణాల కారణంగా దానిని థర్మా మీటర్లలో, భారమితుల్లో (barometers), పీడనమాపనా (pressure gauges)ల్లో విరివిగా వాడతారు. పాదరసానికి ఉన్న ప్రయోజనాలకన్నా విషగుణాల ప్రభావం ఎక్కువ. అందుకే క్రమేపీ పాదరసపు వాడకాన్ని కొన్ని దేశాలు నిషేధించాయి. చాలా పాదరస సమ్మేళనాలు మ ప్రమాదం. అవి మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఒక్కసారి అవి దేహంలో ప్రవేశించాక ఒక పట్టాన బయటకు పోవు. దేహంలోనే వివిధ ఎంజైములతో పెనవేసుకొనిపోయి వాటిని నిర్వీర్యం చేస్తాయి. అందు వల్ల పాదరసపు ప్రభావాన్ని సమీకరణ విషం (cumulative poison)


నిద్రలేమి, మతిమరుపు, అశాంతి, అలసట, శ్రీ ఎపు, అశాంతి, అలసట, భ్రమలు, నిరాశ దృక్పథం వంటివి పాదరసం వల్ల కలిగే విష ఫలితాలు. పాదరసం ఉండే థర్మామీటర్లను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అలాంటి మీటర్లు, బిపి ఆపరేటస్ వంటివి పగిలిపోయి పాదరసం కిందపడి, ముక్కలు ముక్కలయినట్లయితే ఆ ఇంట్లో పాదరస విష ప్రభావం పొంచి ఉన్నట్లే. అలాంటప్పుడు ఒకటి, రెండు కిలోగ్రాముల గంధకపు పొడిని నేలమీద చల్లాలి. గంట సేపయ్యాక జాగ్రత్తగా చీపురుతో తీసి బయట దూరంగా నేలలో పాతి పెట్టాలి. పాదరసం చర్మానికి తగిలితే చర్మపు పొరల గుండా శరీరంలోకి ఇంకిపోతుంది.



పెయింట్లలో, పసుపురంగు, ఎరుపురంగు పెయింట్లలో పాదరసపు పదార్థాలు ఉన్నాయో లేదో రూడీ చేసుకోవాలి. ఎందుకంటే ఆ రంగుల్నిచ్చే పాదరస సమ్మేళనాలను భారతదేశంలో వాడుతుండడం కద్దు. భారతదేశంలో ఎన్నో విషయాలలో ఆంక్షలు, నియంత్రణలు తక్కువ కావడంతో పాశ్చాత్య దేశాలలో నిషేధించ బడిన పదార్థాలు ఇక్కడ ఎంచక్కా మార్కెట్లో రాజాల్లాగా దర్శనమిస్తుంటాయి. పాత రోజుల్లో పాదరస పదార్థాల వినియోగం చాలా పరిమితంగా ఉండేది. కానీ పారిశ్రామిక విప్లవం తర్వాత వివిధ రూపాల్లో పాదరసం వాడకం పెరిగింది. బ్యాటరీలు, బారోమీటర్లు, థర్మామీటర్లు, వైద్య పరికరాలు, పెయింట్లు, కొన్ని మందులు, పళ్ళ నెల్ని కప్పి పెట్టడానికి దంతవైద్యులు పంటి ఫిల్లర్లు, విద్యుత్ రసాయనిక పరిశోధనలు తదితర సందర్భాలలో పాదరసం వాడకం పెరిగింది. తద్వారా పర్యావరణంలో పాదరస కాలుష్యం హెచ్చింది. జపాన్ దేశంలోని మినామిటా సముద్రపు చరియల్లో పారి శ్రామిక వ్యర్థ పదార్థాల్ని పారవేయడం వల్ల 1930-1975 సంవత్స రాల మధ్యకాలంలో అక్కడి చేపలు పాదరసపు కాలుష్య నిలయా లుగా మారాయి. ఈ చేపల్ని తిన్నందున వేలాది జపాన్ దేశీయులు మృత్యు వాతపడ్డారు. లక్షలాదిమందికి శారీరక అంగవైకల్యపు లక్షణాలు వచ్చాయి. హీరోషిమా-నాగసాకి వినాశనాల తర్వాత జపాన్ దేశాన్ని కబళించిన మహమ్మారిగా ఈ మినామిటా కాలుష్య కారణాల్ని పేర్కొంటారు. కాబట్టి మనం అర్థంచేసుకోవాల్సింది ఏమిటంటే, చూడ్డానికి చక్కగా ఉందనో, మెరుస్తుందనో, పేరులో చైతన్యం (mercury) అంటే గ్రీకు భాషలో చలాకీతనం) ఉందనో పాదరసాన్ని దగ్గరికి రానిస్తే అది మనల్ని పదే పదే పదివిధాలా వ్యాధులకు గురిచేస్తుంది. కాబట్టి ప్రజలు, డాక్టర్లు పాదరస సంబంధ పరికరాలకు బదులు ఇతర ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రత్యామ్నాయ థర్మామీటర్లుగా వాడాలి. సాధారణ బి.పి. అపరేటర్స్ స్థానే ఎలక్ట్రానిక్ పద్ధతి వాడాలి. నేటికీ ఆయుర్వేద వైద్య పద్ధతులలో పాదరసాన్ని ఏదో ఒక మోతాదులో వాడుతున్నారు. ఆలోపతి మందుల్లోనూ వాడుతున్నారు. ఆలోపతి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని గోల చేసే వాళ్లు కొన్ని సాంప్రదాయ వైద్య పద్దతు ల్లో వాడే పదార్థాల విషప్రభావాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. 


పుక్కిటి పురాణాల్లో పాదరసమే అన్ని లోహాలకు మూల కారణమని చెప్పేవారు. పాదరసాన్ని తీసుకుని అందులో గంధకం (sulpur) మోతాదును మారుస్తూ వెళితే అది రాగి, వెండి, బంగారు లోహాలుగా మారుతుందని నమ్మేవారు. 'మా పురాణాల్లోనే అన్నీ ఉన్నాయష' అని చెప్పే వారు ఇలాంటి అశాస్త్రీయ వాదనలు కూడా తమ విశ్వాసగ్రంథాల్లో ఉన్నాయన్న విషయాన్ని కావాలనే మరుగున పెడతారు. పాదరసాన్ని ఏ విధంగా ప్రయత్నించినా బంగారంగా మార్చలేరు. ప్రకృతిలో పాదరసం సరాసరి పాదరసంగా లభించదు. అలా లభించడం చాలా అరుదు. ఎక్కువ భాగం పాదరసం సిన్నబార్ (cinnabar) అనే సల్ఫైడ్ ఖనిజం (Hgs) రూపంలో లభిస్తోంది. సిన్నబార్ పొడిని బాగా వేడి చేసి, దాని మీదకు వేడి గాలుల్ని పంపితే గాలిలోని ఆక్సిజన్ సిన్నబా తో చర్య జరిపి గంధక భాగాన్ని సల్ఫర్ డై ఆక్సైడ్ గా వేరు చేసేస్తుంది. .


మూలక రూపంలోకి వెళ్లిన పాదరసం ఆ అధిక ఉష్ణోగ్రత దగ్గర ఆవిరి రూపంలో ఉన్నా చల్లబర్చాక మామూలు ద్రవమవు తుంది. సల్ఫర్ డై ఆక్సైడ్ అలాగే వాయురూపంలో ఉండిపోతుంది. ఆ విధంగా పాదరసాన్ని వేరుచేస్తారు. . ,


చెట్లు కూడా జీవులే కాబట్టి పాదరసపు విషం జీవుల్లోని పైరువేట్ డీ హైడ్రోజినేజ్ ఎంజైమును ధ్వంసం చేస్తుంది. దరిమిలా జీవులు నాశనమవుతాయి.


బౌద్ధమత సన్యాసుల తమ మతాన్ని వ్యాప్తిని చేస్తుంటే వారిని అడ్డుకోవడానికి మధ్యయుగాల నాటి ప్రధాన మతగురువులు బౌద్ధ బిక్షువుల చెవుల్లో వేడి పాదరసం పోసి, చంపేవారని అంటుంటారు. అందులో నిజా నిజాలు మనకు తెలియవు.


(ఎందుకని? ఇందుకని! పుస్తకం నుండి)